ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం విధించిన మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండటంతో లాక్ డౌన్ పొడిగించాలా...? వద్దా...? అనే నిర్ణయాన్ని ప్రజలకే వదిలిపెట్టారు. ప్రజలు లాక్ డౌన్ కొనసాగించాలో, వద్దో అనే దానిపై అభిప్రాయాలు తెలపాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. వాట్సప్ నంబర్ 8800007722 లేదా delhicm.suggestions@gmail.com కు సలహాలు, సూచనలు పంపాలని కోరారు. 
 
1031 నంబర్ కు కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు లాక్ డౌన్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కేజ్రీవాల్ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని సీఎం ప్రధాని నిన్న సూచించారు. ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: