ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్థంభించినపోయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్లు ప్రత్యేక పరిమిషన్లు తీసుకొని వాహనాలు నడుపుతున్నారు.  ఇక మెడికల్ అత్యవసర పరిస్థితుల్లో 108 లాంటి వాహనాలు నడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లాలోని బయ్యారం మండలం సింగారం గ్రామానికి చెందిన బుర్ర కుమారి నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను తల్లిదండ్రులు బయ్యారం పీహెచ్‌సీ కి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా  వాహనంలోనే కవలలకు ( పాప, బాబు) జన్మనిచ్చింది.  కాకపోతే ప్రసవించే సమయంలో మాత్రం అక్కడి ఆయాలు కంగారు పడ్డా దేవుడి దయవల్ల ప్రశాంతంగా ప్రసవం జరిగింది.

 

తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. సకాలంలో వైద్యం అందించి సుఖ ప్రసవం జరిగేలా చేసిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. అయితే కరోనా ప్రబలిపోతున్న నేపథ్యంలో  వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో గొప్పగా ఉంటున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: