దేశంలో లాక్ డౌన్ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సమయంలో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది..దాంతో రైతులు ఇక్కట్లు అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం వారికి ఎలాంటి కష్టం లేకుండా చూస్తుంది. యాసంగిలో తెలంగాణ రాష్ట్రం భారీగా ధాన్యం కొనుగోలు చేసింది. ఈ యాసంగి సీజన్‌లో దేశ వ్యాప్తంగా ధాన్యం, గోధుమల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 664.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ట్వీట్‌ చేసింది. ధాన్యం సేకరణలో పంజాబ్‌ మొదటిస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

 

లాక్ డౌన్ ఆంక్షల నుంచి సాగు పనులతో పాటు ధాన్యసేకరణకు మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. హర్యానా 64.23 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌ 58.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎఫ్‌సీఐ ప్రకటించింది. మే 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం విదితమే.  ఆంధ్రప్రదేశ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఏపీ 10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని  కేంద్ర మంత్రి పాశ్వాన్ ఈ నెల 9న ట్వీట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: