తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది అదా శర్మ.  బాలీవుడ్ లోకెరీర్ ప్రారంభించినా తెలుగు ఫస్ట్ చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. కాకపోతే ఈ బ్యూటీకి తెలుగు లో చెప్పుకోదగ్గ చిత్రాలు ఏవీ పడలేదు. దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అప్పుడప్పుడు తెలుగు లో మెరుస్తుంది.  ఆ మద్య అడవి శేష్ నటించిన ‘క్షణం’  ఈ బ్యూటీకి కలిసి వస్తుందనుకున్నా వర్క్ ఔట్ కాలేదు. స్వతహాగా జమ్నాస్టిక్ లో నెంబర్ వన్ అదాశర్మ.  ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ, హిందీ వెబ్‌సిరీస్‌ల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగానే ఉంది.

 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శర్మ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. మదర్స్ ‌డే సందర్భంగా అదా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. `హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో చివరి దాకా చూడండి.  ఈ వీడియోలో తన అమ్మ గొప్పతనం గురించి చెబుతుంది. మా అమ్మ తెలివైంది, చురుకైనది, బలమైనది, అందమైనది, ఉత్తమమైనది. వంటలో మా అమ్మని ఎవరూ బీట్ చేయలేరు' అంటూ తన తల్లి గురించి కామెంట్ చేసింది. అదా పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: