టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి వివాహం ఖరారు అయింది. ఈ వార్తను రానా తల్లి, సురేష్ బాబు భార్య పలువురు సినీ రాజకీయ, మీడియా ప్రముఖులకు ఫోన్ ద్వారా చెప్పారు. రానా వివాహం కుదిరింది అని చెప్పారు గాని పెళ్లి కూతురు వివరాలను గాని పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని గాని ఆమె వెల్లడించలేదు. 

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మీడియా మొఘల్ రామోజీ రావు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున ఇలా అందరికి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ లు చేసి విషయాన్ని చెప్తున్నారు. పెళ్లి ఎప్పుడు అనేది త్వరలోనే చెప్తామని చెప్పినట్టు తెలిసింది. కాగా రానా మిహీకా బజాజ్ అనే ఈవెంట్ మేనేజర్ ని ప్రేమ వివాహం చేసుకోనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: