టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి చేసిన సినిమాలు తక్కువే అయినా అతనికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా లో అతను ఏది పోస్ట్ చేసినా సరే కాస్త ఎక్కువగా క్రేజ్ వస్తు ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన తన కాబోయే భార్య గురించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. 

 

మిహికా బజాజ్ అనే అమ్మాయిని తాను వివాహం చేసుకుంటున్నా అని రానా చెప్పాడు. దీని తో ఆమె ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు అభిమానులు ఆరా తీస్తున్నారు. మిహీకా బజాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారు. వీరి మధ్య దాదాపు పదేళ్ళు గా స్నేహం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: