తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రభాస్, రానా.  ఈ ఇద్దరు హీరోలు పెళ్లి ప్రస్తావన  తీసుకు వచ్చినప్పుడల్లా చూద్దాం.. టైమ్ ఉందని.. పెద్దలు చూసుకుంటారని చెప్పేవారు.  అయితే ప్రభాస్ పెళ్లి విషయంలో ఆయన పెద్దనాన్న కృష్ణం రాజు చూసుకుంటారని డిసైడ్ అయ్యారు. ఇక రానా విషయం మాత్రం అలా సస్పెన్స్ గా సాగుతూ వచ్చింది. తాజాగా తనకు కాబోయే భార్య ఫొటోని పోస్ట్ చేసిన రానా, ఆమె ఒప్పుకుంది అంటూ తెలిపారు. టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన రానా ఓ ఇంటివాడు కాబోతున్న విషయాన్ని ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న హీరోలు తట్టుకోలేకపోతున్నారు.  తాజాగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రచ్చ రచ్చ అవుతుంది.. అంతే కాదు సెలబ్రెటీలు కూడా వెంటనే తమ సోషల్ మాద్యమాల్లో స్పందిస్తున్నారు. 

 

ఇంత సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చాడేంటి అని అంతా ఇప్పుడు రానా పోస్ట్‌కి కామెంట్ కామెంట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ మెగా హీరో సాయితేజ్ చేసిన పోస్టే.   ఇంతకీ సాయితేజ్ ఏం పోస్ట్ చేశారో తెలుసా?..  నిద్ర మద్యలో లేచిన ఓ వీడియోని పెట్టి.. ‘‘ఇది ఒక కల.. గుడ్ నైట్ మళ్లీ పడుకుంటున్నా.. ’’ అని సాయితేజ్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయితేజ్ చేసిన ట్విట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్యాచ్‌లర్స్ ఒకలా, పెళ్లి అయిన వారు మరోలా చేస్తుండటం విశేషం. ‘మరి మీ పెళ్లి ఎప్పుడు’ అని కొందరు.. ‘మనం సింగిల్ అయినందుకు గర్వపడదాం..’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: