తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో వ్యవసాయ శాఖపై సమీక్షా సమవేశం నిర్వహించారు. రైతుల క్షేమం కోసమే నియంత్రణ పద్దతిలో పంటల సాగు అని పేర్కొన్నారు ఆయన. రైతులు... ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చెయ్యాలని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

 

ప్రభుత్వం రైతుల క్షేమం కోసం ఆలోచన చేస్తుంది అని అన్నారు. ఈ వర్షాకాలం నుంచే రైతులు నియంత్రణ పద్దతిలో వ్యవసాయం చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ నెల 15 న క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఇక ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు పై కూడా ఆయన చర్చించారు. అలాగే రైతు బంధు కార్యక్రమం గురించి కూడా చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: