ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా పేరే జపిస్తున్నారు.  కరోనా వల్ల క్రీడా, సినీ, వ్యాపార రంగాలన్నీ మూతపడ్డాయి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలు, డైలాగులపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా బన్నీ పాటలకు మంచి మంచి స్టెప్పులేస్తూ అందరినీ అలరిస్తున్నాడు.

ఇప్పటికే బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించిన వార్నర్, పోకిరిలో హిట్ డైలాగ్ చెప్పి మరింత విస్మయానికి గురిచేశాడు. ఇప్పుడు రాములో రాములా పాటకు తన కుటుంబ సభ్యులతో కలిసి వార్నర్ టిక్ టాక్ లో మరో వీడియో చేశాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. "మరో పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు సర్. ఈసారి చంపేశారు. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. తన భార్యతో కలిసి వార్నర్ హుషారుగా స్టెప్పులేస్తుండగా, కూతురు కూడా హుషారుగా కాలు కదిపింది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.. తమ హీరో  ఇంటర్ నేషనల్ లెవెల్లోపాపులర్ అయ్యారని తెగ సంబరపడిపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: