కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రజలను ఆదుకోవడానికి గానూ ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజిని ఆయన ప్రకటించారు. దేశ జీడీపీ లో పది శాతం తో ఈ ప్యాకేజిని ప్రకటిస్తున్నాం అని మోడీ అన్నారు. సూక్ష మధ్య తరగతి వర్గాలకు ఈ ప్యాకేజి ఉపయోగపడుతుంది అని మోడీ పేర్కొన్నారు.


 
ల్యాండ్, లా, లేబర్, లిక్విడిటి కి ఈ ప్యాకేజి బాగా ఉపయోగపడుతుంది అని మోడీ పేర్కొన్నారు.  భారత ఆర్ధిక వ్యవస్థకు ఈ ప్యాకేజి ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రతీ కార్మికుడికి ఆర్ధిక ప్యాకేజి ఉపయోగపడుతుందని అన్నారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు ప్యాకేజి ఉపయోగపడుతుందని మోడీ వ్యాఖ్యానించారు. ప్రతీ వలస కార్మికుడి కి ప్రభుత్వం అండగా ఉంటుందని మోడీ చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: