ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనాపై పోరులో నాలుగు నెలల సమయం గడిచిపోయిందని అన్నారు. వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసిందని.. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోందని తెలిపారు. ఇంత పెద్ద ఆపద భారత్ కు ఒక సందేశాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో రెండు లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు తయారవుతున్నాయని తెలిపారు. 
 
భారత్ లో చాలామంది కరోనా వల్ల సొంతవాళ్లను కోల్పోయారని మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత్ సత్తా ఎంతో ప్రపంచం చూస్తోందని మోదీ అన్నారు. మోదీ దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక చేయూతను ఇస్తుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: