క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ అమ‌లుకు పోలీసులు రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు. కుటుంబాల‌కు దూరంగా ఉంటూ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. దాదాపుగా లాక్‌డౌన్ విధించిన‌నాటి నుంచి పోలీసులు వీక్ఆఫ్ తీసుకోకుండా విధుల్లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు పోలీసులు తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నారు. అంతేగాకుండా.. ప‌లువురు పోలీసులు క‌రోనా వైర‌స్ బారిన కూడా ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పోలీసుల‌కు వీక్ఆఫ్ ఇచ్చేందుకు ఆయ‌న అంగీక‌రించారు. దీనిని రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో అమ‌లు చేసేందుకు సీపీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

 

ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. దాదాపుగా కొద్దిరోజులుగా అత్య‌ధిక కేసులు హైద‌రాబాద్‌లోనే న‌మోదు అవుతున్నాయి. మొన్న ఏకంగా 79 కేసులు, నిన్న 37 కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 70కి చేరుకున్నది. ఈజోన్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు విస్తృతంగా పారిశుధ్య, రసాయనాల పిచికారీ చేపడుతున్నారు. ఆయా జోన్లలోని వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: