ప్రపంచ వ్యాప్తంగా వృద్దులు క్రమంగా కరోనా వైరస్ నుంచి కోలుకుని బయటపడుతున్నారు. ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా చికిత్స చేయించుకుని కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. కరోనా నుంచి 113 ఏళ్ళ వృద్దురాలు పూర్తిగా కోలుకున్నారు. స్పెయిన్ కి చెందిన వృద్ద మహిళ ఈ విధంగా కోలుకుని బయటపడ్డారు. 

 

స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల మరియా బ్రన్యాస్‌ అనే వృద్ధురాలికి ఏప్రిల్ లో కరోనా రాగా ఓల్డేజ్‌ కేర్‌ హోంలోని తన గదిలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుని ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కరోన నుంచి కోలుకున్న అతి పెద్ద వయసు ఉన్న వృద్దురాలు ఈమెనే.

మరింత సమాచారం తెలుసుకోండి: