భార‌తదేశ వ్యాప్తంగా కేవ‌లం నాలుగైదు రాష్ట్రాల్లోనే అత్య‌ధిక క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ప్ర‌ధానంగా నాలుగు రాష్ట్రాల్లోనే వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. మహారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 24,427 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత‌ గుజరాత్‌లో 8,903, తమిళనాడులో 8,718, ఢిల్లీలో 7639 కేసులు న‌మోదు అయ్యాయి. ముంబై, అహ్మ‌దాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కరంగా మారుతోంది. ఇక‌ ఈ నాలుగు రాష్ట్రాల్లో న‌మోదు అయిన కేసులు దాదాపుగా 50వేల కేసుల‌కు చేరువ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. అలాగే.. రాజ‌స్తాన్‌లో కూడా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 4,126 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

 

ఇక దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3525 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 74281కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం  47480గా ఉంది. మొత్తం కరోనా కారణంగా 2415 మంది ప్రాణాలు కోల్పోయారు. 24,386 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: