దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగడం తో ప్రజా రవాణా వ్యవస్థ ఏ స్థాయిలో దెబ్బ తిన్నదో తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రజా రవాణా విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పట్లో జనాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 

 

జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని స్పష్టం చేస్తూ రవాణా శాఖకు ఒక దరఖాస్తు చేసాయి. ఈ నిర్ణయంతో త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. మొత్తం 800 బస్సుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మూడు నెలల పాటు బస్సులు నడపకపోతే త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: