సాధారణంగా భూకంపం అంటే ఎవరికైనా భయమే.. స్వల్ప తీవ్రత అయితే పరవాలేదు.. కానీ ఈ భూకం వల్ల ఎంతో ఆస్తినష్టం.. ప్రాణ నష్టాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆ మద్య నేపాల్, కాట్మాండ్ లో వచ్చిన భూకం ఛాయలు ఇంకా సమసిపోలేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి నేపాల్ లో స్వల్ప భూకంపం రావడంతో జనాలు హడలిపోయారు.   డోల‌ఖా జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి 11: 53 గంట‌ల స‌మ‌యంలో భూప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌త ‌తో ప్ర‌కంప‌న‌లు న‌మోదైన‌ట్లు నేపాల్ లోని నేష‌న‌ల్ సిస్మోలాజికల్ సెంట‌ర్ తెలిపింది. భూకంపంతో కొంత‌మేర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌క‌టించింది. 

 

భూకంప ప్రభావంతో ఖఠ్మాండూ, కాస్కీ, పర్సా, సింధుపల్‌‌చోక్ తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారే భయపడిపోడి పరుగులు తీశారు.   భూకంపం కారణంగా ఎవరూ గాయపడినట్టు కానీ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు. హిమాల‌య‌న్ స‌రిహ‌ద్దు దేశ‌మైన నేపాల్ ను త‌ర‌చూ భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయ‌నే విష‌యం తెలిసిందే.  మ‌రోవైపు ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని సాంటా క్రూజ్ ఐలాండ్స్ లో మంగ‌ళ‌వానం 6.5 తీవ్ర‌త‌తో భూకంపం న‌మోదైందని  స్థానిక భూకంప అధ్య‌య‌న కేంద్రం వెల్ల‌డించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: