దేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి కరోనా మహమ్మారి భయంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి నానా తంటాలు పడుతున్నారు. అంతే కాదు కరోనా రక్కసిని దూరం చేయాలంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించాలని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిందని అంటున్నారు పోలీసులు.  అయితే అక్కడక్క కొన్ని దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హిజ్రాను తానే చంపానని ఓ కారు డ్రైవర్  కేయూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 

 

వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లాలో  కేయూ పీఏస్‌ పరిధిలోని సదానంద కాలనీలో హారిణి  అనే  హిజ్రా హత్యకు గురైంది. అయితే ఆ హిజ్రాను తానే చంపానని సురేశ్‌ అనే కారు డ్రైవర్‌ ఒప్పుకున్నాడు.. దానికి కారణం గత కొంత కాలంగా లో హారిణి  అనే  హిజ్రా తనను మానసికంగా, లైంగిక వేధింపులకు గురిచేయడంతోనే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ పై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: