తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. నిన్న నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని... సోషల్ డిస్టెన్స్ పాటించలేదని సమాచారం అందుతోంది. బండి సంజయ్ నిన్న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఊటపల్లి రైతులను పరామర్శించారు. 
 
బత్తాయి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ వల్ల పెట్టుబడులు సైతం రావడం లేదని... ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు విన్న బండి సంజయ్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ స్థానంలో ఉన్న బండి సంజయ్ లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో పోలీసులు ఆయనపై, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: