ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 16న ఈ అల్పపీడనం వాయుగుండం గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రానికి తుఫాను గా మారే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

 

దీని కారణంగా తెలంగాణాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా, ఆంద్ర లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: