ప్రసవమే పునర్జన్మ అనుకుంటే కరోనా సోకిన గర్భిణికి ఆ కాన్పు చేయటం మరింత కత్తి మీద సామే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిండు చూలాలికి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా పురుడు పోశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో డాక్టర్లు ఎన్నో కష్టాలు తమ భుజాలపై వేసుకుంటున్నారు.  ఇదే సమయంలో ఓ తల్లీకి పురుడో పోసి మరోసారి గ్రేట్ అనిపించుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రసవం చేయడం ఇదే తొలిసారని వారు తెలిపారు. హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి(22)కి ఇటీవల కరోనా సోకగా కింగ్‌ కోఠి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి 10.30 సమయంలో పురిటి నొప్పులు రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

శుక్రవారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉంది. తాజాగా గాంధీ ఆసుపత్రి మరోసారి అద్బుతాన్ని సాధించింది. గత వారమే కరోనా సోకిన మహిళకు ప్రసవం చేసి క్షేమంగా బిడ్డకు ప్రాణం పోసిన గాంధీ వైద్యులు మరో బిడ్డకు ప్రాణం పోసారు.  ఈ రోజు మరో కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసి మరో ఘణత సాదించారు. కరోనా సోకిన గర్భిణిని ప్రాణాలతో కాపాడడమే పెద్ద సవాళుగా ఉంటే ఏకంగా శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: