దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో దేశంలోని అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. లాక్ డౌన్ వల్ల, సామాన్యులు మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో ఏకంగా 10 శాతాన్ని మోదీ ప్యాకేజీ కింద ప్రకటించారు. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధిన కీలక వివరాలను వెల్లడిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ గురించి దేశ ప్రజంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని మోదీ ప్రకటించారని చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించి ప్యాకేజీని రూపొందించామని చెప్పారు. 
 
ప్యాకేజీ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: