కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ సమగ్రమైన దార్శనికతను దేశం ముందు ఉంచారని అన్నారు. వివిధ స్థాయిలో సంప్రదింపుల ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంఛి స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా ప్యాకేజీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ను ఐదు మూల సూత్రాలుగా విభజించామని చెప్పారు. 
 
 
స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న లక్ష్యం మన ముందు ఉందని చెప్పారు. ప్యాకేజీని ఆర్థిక, మౌలిక, సాంకేతిక, డెమోగ్రఫీ, డిమాండ్ గా విభజించామని అన్నారు. పేదలు, వలస కూలీల ఖాతాల్లోకి నగదు నేరుగా జమవుతుందని ఆమె అన్నారు. దేశంలోని యువతను ఎలా వినియోగించుకోవాలనుకునే దానిపై దృష్టి పెట్టినట్టు ఆమె తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: