కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటయింపులు ఉంటాయని చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇస్తామని అన్నారు. 12 నెలల మారటోరియంతో రుణాలు ఇస్తామని చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 
 
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తక్షణం ఉత్పత్తులను ప్రారంభించేదుకు ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. అక్టోబర్ వరకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగులకు భద్రత కల్పించటానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: