కరోనా లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న మధ్య తరహా సూక్ష, కుటీర పరిశ్రమలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజి లో కేంద్రం 3 లక్షల కోట్లను వారికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి ఇబ్బంది లేని రుణాలను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 

 

ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఎంఎస్ఎంఈ లకు మరో 3 నెలలు ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2500 కోట్ల రూపాయల ఈపీఎఫ్ ని కేంద్రమే చెల్లిస్తుందని చెప్పారు. జూన్, జులై, ఆగస్ట్ నెలలకు కేంద్రమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా వివరించారు. రుణాలను వేగంగా అందించే ఏర్పాటు చేస్తామని నిర్మల వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: