ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘స్వీయ ఆధారిత భారతం’ పేరుతో ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు ఆమె తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని నిర్మల చెప్పారు. వివిధ స్థాయుల్లో సంప్రదింపులను జరిపిన తర్వాత ప్యాకేజీని ప్రకటించారని... దేశ ఆర్థికి వృద్ధిని పెంచడమే ప్యాకేజీ లక్ష్యమని చెప్పారు.  గుజరాత్ భూకంపం నుంచి ప్రస్తుత ప్యాకేజీ ప్రకటన వరకూ అది నిరూపణవుతూనే ఉందని ఆమె అన్నారు. సూచనలను కూడా ఈ పథకం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారని నిర్మల తెలిపారు.  దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను మోదీ ఉంచారు.

 

స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ప్యాకేజీ లక్ష్యం అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం అని అర్థం వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. అందుకోసమే దీనికి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. .రూ.20000 కోట్ల రూపాయలను ఇబ్బందుల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందిస్తాం. దీంతో 2 లక్షల పరిశ్రమలు లాభపడతాయి. ఎన్‌పీఏలు, అన్ని ఎంఎస్ఎంఈలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆమె అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: