కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ చిన్న సంస్థలకు భారీ ఊరట కల్పించారు. చిన్న సంస్థల ఉద్యోగుల పీఎఫ్ కేంద్రమే చెల్లిస్తుందని అన్నారు. ఆత్మ నిర్భర్ ఇండియాకు, మేకిన్ ఇండియా తోడ్పడుతుందని చెప్పారు. సంస్థలు పీఎఫ్ 12 శాతం కాకుండా పది శాతం చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె చెప్పారు. 
 
కరోనా సమయాన్ని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యాఫ్ గాడ్ గా చూడాలని చెప్పారు. ఈ మేరకు ప్రాజెక్ట్ ఒప్పందాల అమలుకు సంబంధించిన మార్పులు సూచిస్తున్నామని అన్నారు. నిర్మాణ, సేవల కాంట్రాక్టులకు ఆరునెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పనుల పూర్తికి ఆరు నెలల అదనపు సమయం ఇస్తామని చెప్పారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: