కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఉన్న టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వివరాలను ప్రకటించారు. రేపటి నుంచి 2021 సంవత్సరం మార్చి 31 వరకు టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు అమల్లో ఉంటుందని అన్నారు. ఈ వెసులుబాటు వల్ల ప్రజలకు 50,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కేంద్రం ట్యాక్స్ రిటర్న్ గడువును జులై 31 నుంచి అక్టోబర్ 31కు పెంచింది. 
 
మరోవైపు కేంద్రం పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించింది. చిన్న సంథల 2500 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల కోసం కేంద్రం 90,000 కోట్ల లిక్విడిటీ ప్రకటించింది. కరోనా సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ గా పరిగణిస్తామని నిర్మల పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయల లోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: