దేశ రక్షణ కోసం  నిరంతరం శ్రమించే భారత జవాన్ల కు కేంద్రం తీపి కబురు వినిపించింది.  భారత సైన్యంలోని త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు జనరల్ బిపిన్ రావత్ ఓ హింట్ ఇచ్చారు. జవాన్ల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సును యాబ్భై సంవత్సరాలకు పెరుగనున్నట్టు తెలిపారు. ఆర్మీలో జ‌వాన్ల‌తో పాటు ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్‌మెన్‌, నేవీలో సెయిల‌ర్ల రిటైర్మెంట్ వ‌య‌సును కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.  గతంలో జ‌వాన్లు కేవ‌లం 15 లేదా 17 ఏళ్లు మాత్రమే సేవ చేసేవాళ్ళు. ఇక  కేంద్రం స్వస్తి పలకనుందని ఆయన అన్నారు. 

 

ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలకనుందని ఆయన అన్నారు. మిగతా ఉద్యోగుల్లాగా జవాన్లు ఎందుకే 30 ఏళ్ళపాటు స‌ర్వీస్‌లో ఉండకూడదని రావ‌త్ అన్నారు. సైన్యంలో శిక్ష‌ణ పొందిన జవాన్లను తొంద‌ర‌గా కోల్పోకూడ‌ద‌న్నారు. ఇక రిటైర్ అయిన వారి అర్హతను బట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండేవి.  ఇక  త్రివిధ ద‌ళాల్లో ఉన్న జ‌వాన్ల రిటైర్మెంట్ వ‌య‌సు పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకున్న‌ట్లు రానున్న‌ట్లు రావ‌త్ తెలిపారు. ఈ విధానం వ‌ల్ల త్రివిధ ద‌ళాల్లోని సుమారు 15 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూర‌నున్న‌ది.  

మరింత సమాచారం తెలుసుకోండి: