గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. అధికారులు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 కంపెనీలను అధికారులు సీజ్ చేశారు. పలువురు వ్యాపారులు సడలింపులు ఇవ్వకపోయినా షాపులు తెరిచినట్లు గుర్తించారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, సైనిక్ పురి, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్ అమీర్ పేట్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 
 
స్టడీ సెంటర్లు, మొబైల్ షాపులు, గృహోపకరణ షాపులు, ఆట వస్తువుల దుకాణాలు, ఏసీ షాపులు షాపులను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా షాపులు ఓపెన్ చేసే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గత వారం దాదాపు 140 షాపులను సీజ్ చేసినా వ్యాపారుల తీరులో మార్పు లేకపోవడంతో అధికారులు తనిఖీలు కొనసాగిస్తామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: