దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  మార్చి నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో ఈ నెల 17 వరకు పెంచారు.  తాజాగా యుపిలోని ఆగ్రా జైలులో కరోనాతో ఒక ఖైదీ మరణించారు. మరో పదిమందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో 1,350 మంది ఖైదీలు, 112 జైలు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, యుపిలోని ఆగ్రా జైలులోని 60 ఏళ్ల ఖైదీకి బిపి పెరగడంతో అతనిని ఎస్‌ ఎన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించామని, దీంతో అతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్థారించారని అన్నారు. చికిత్స పొందుతున్న ఆ ఖైదీ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో  మరణించారని అన్నారు.

 

దీంతో సదరు ఖైదీకి కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో పదిమంది ఖైదీలకు వైరస్ సోకినట్లు తేలింది.వారిలో పది మందికి కరోనా సోకినట్లు వెల్లడైందని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ తెలిపారు. మార్చి నుండి బయటివ్యక్తులను నిలిపివేశామని అన్నారు. ఆ ఖైదీకి కరోనా ఎలా సోకిందనే అంశంపై స్పష్టత లేదని అన్నారు. ఈ వివరాలను ఆగ్రా సెంట్రల్ జైల్ సీనియర్ సూపరింటెండెంట్ బీకే సింగ్ వెల్లడించారు. జైల్లోని మొత్తం 1,350 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: