టాలీవుడ్‌లో త‌న‌దైన న‌టన‌తో ప్రేక్ష‌కులను అల‌రించే హీరో నిఖిల్ పెళ్లి సంద‌డి మొద‌లైంది. నిఖిల్‌ నేడు ఓ ఇంటివాడు అయ్యాడు. డాక్టర్‌ పల్లవి వర్మతో ఏడడుగులు వేశాడు. నిజానికి.. ఏప్రిల్‌ 16న వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో వాయిదా పడింది. నేడు షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో నిఖిల్‌–పల్లవిల వివాహం ఉదయం 6:31 గంటలకు జరిగింది.

 

కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులతో నిరాడంబరంగా ఈ పెళ్లి జరిగింది. కాగా, బుధవారం సాయంత్రం నిఖిల్‌ని పెళ్లి కొడుకుని, పల్లవిని పెళ్లి కూతురిని చేశారు. ఇక ఈ వివాహానికి అతికొద్దిమంది మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. కాగా, ‘స్వామిరారా, సూర్య వర్సెస్‌ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్‌ సురవరం’ వంటి సినిమాల‌తో నిఖిల్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: