తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఇప్పుడు కోయంబేడు లింక్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కోనసీమలో కోయంబేడు లింక్ లు ఉన్న 5 మందికి కరోనా వచ్చింది. దీనితో ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

 

దీనితో అక్కడ లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తుంది ప్రభుత్వం. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు మందులకు అనుమతి ఇస్తున్నారు. త్వరలో అక్కడ రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ప్రభుత్వమే సరుకులను అందించే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు కోనసీమ గ్రామాలు అన్నీ కూడా కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: