లాక్ డౌన్ తర్వాత వలస కార్మికులు చాలా వరకు అందుబాటులో ఉన్న వాహనాల్లో తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. శ్రామిక్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నా సరే వారు అవి తమకు అందుబాటులో లేవని ఏదోక ట్రక్ లేదా భారీ వాహనాల్లో సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న కార్మికులు తాజాగా ప్రమాదానికి గురయ్యారు. 

 

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కాలి నడకన వెళ్తున్న వారి మీద బస్ దూసుకు వెళ్ళిన ఘటన మరువక ముందే తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ గుణలో ఒక ట్ర‌క్కు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారు అందరూ కూడా యువకులే. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. తమ రాష్ట్రం నుంచి వెళ్ళే వారికి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: