కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. శాస్త్రవేత్తలు కరోనా కు మందు కనిపెట్టడానికి ల్యాబ్ లలో కుస్తీ పడుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు వాక్సిన్ వస్తుందా ఎప్పుడు వైరస్ బారి నుండి బయట పడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, దాదాపు మూడు లక్షల మంది మరణించారు. 16 లక్షల మందికిపైగా కోలుకున్నారు.  ఇక కరోనా తో లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామని దేశాన్ని లాక్ డౌన్ ను ఎత్తేసే ప్రయత్నలనే చేస్తున్నాయి. కరోనా తో ప్రజలు కలిసి జీవించాలి అంటూ సాహఉ కూడా ఇస్తున్నారు.  ఎంతో టెక్నాలజీ సాధించిన అగ్రదేశాలు సైతం కరోనా ముందు తలదించుకునే పరిస్థితి నెలకొంది. 

 

కొత్త కేసులు, చావులను ఆపలేకపోతున్నారు.  అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తుండడంపై అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలను ఎత్తివేయడం తొందరపాటు చర్యే అవుతుందని, నియంత్రించలేని స్థాయికి వైరస్ చేరుకుంటుందని హెచ్చరించారు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో మరణ మృదంగం మోగుతుంది రష్యాలో..  ఇక్కడ కొత్తగా పదివేల మందికి వైరస్  సోకింది. ఆఫ్రికాలోని లెసొథో దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. హాంకాంగ్‌లో 24 రోజుల తర్వాత తొలి కేసు నమోదైంది. న్యూజిలాండ్‌లో వరుసగా రెండో రోజూ కేసులు నమోదు కాలేదు. స్పెయిన్‌ను మాత్రం వైరస్ వీడడం లేదు. అక్కడ గత 24 గంటల్లో 184 మంది చనిపోగా, 400 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: