హైదరాబాద్ లో ఉదయం నుంచి అధికారులకు చిరుత చుక్కలు చూపిస్తుంది. దాన్ని ఎలా అయినా సరే పట్టుకోవాలని అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎటు నుంచి వెళ్తుందో అర్ధం కాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ముందు అది అడవిలోకి పారిపోయింది అని భావించారు. కాని అది అడవిలోకి వెళ్ళలేదు. 

 

గగన్ పహాడ్ వంతెన కింద ఉందని తెలియడం తో దాన్ని పట్టుకోవడానికి ఆపరేషన్ మొదలుపెట్టారు. వంతెన మీద నుంచి దాన్ని పట్టుకోవడానికి గానూ ఇప్పుడు మత్తు మందు ని గన్ తో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో ఆ రోడ్డు మీద ప్రయాణాలను పూర్తిగా ఆపేశారు అధికారులు. కనపడిన వెంటనే పట్టుకుంటాం అని ఎవరూ కూడా భయపడవద్దు అని సూచిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు దాని కోసం రంగం లోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: