ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజి మీద ఇప్పుడు పలు వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ప్యాకేజి వలన ఉపయోగాలు ఏమీ లేవని అప్పులు ఇవ్వడం ఆదుకోవడం ఏ విధంగా అవుతుందని, అప్పులు ఇస్తే నష్టాలు ఏ విధంగా పూడే అవకాశం ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. 

 

కాంగ్రెస్ సహా వామపక్షాలు అన్నీ కూడా దీన్ని తప్పుబడుతున్నాయి. కేంద్రం ప్రకటించినా సరే బ్యాంకు లు ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నాయి. దీని వలన ప్రజలకు ఉపయోగం లేదని కొట్టిపారేస్తున్నారు. కేవలం హడావుడి చేయడం ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడమే దీని ఉద్దేశం అని అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు ఆర్ధిక సహాయం తిరిగి తీసుకోవడానికి కాదని చెప్తున్నారు. జీడీపీ లో ఇది కేవలం 2 శాతమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: