పారిశ్రామిక వేత్తలు ప్రధాని నరేంద్ర మోడిని దేవుడులా కొలుస్తున్నారు అని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మేక్ in ఇండియా ను ప్రోత్సహించే విధంగా మోడీ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 

 

మోడీ నిర్ణయం తో స్వదేశీ ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుందని కన్నా అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలని కన్నా విజ్ఞప్తి చేసారు. దేశం అందరికి ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అన్నారు. కాగా చిన్న మధ్య తరగతి కంపెనీలకు మూడు లక్షల కోట్ల ప్యాకేజిని కేంద్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 లక్షల కొట్లలో వారి కోసం గానూ 3 లక్షల కోట్లను కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: