వలస కూలీలపై దాడి చేసిన ఒక పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు సీరియస్ అయి విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వలస కూలీలపై చేయి చేసుకోవడ౦తో పాటుగా మీడియా ప్రతినిధి పై అమానుషంగా దాడి చేసిన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నర్సయ్యను రాచకొండ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు. 

 

పోలీస్ స్టేషన్ వద్దకు కార్మికులు పాస్ లు కోసం రాగా వారిపై దాడికి దిగాడు. అలాగే వీడియో రికార్డ్ చేస్తున్న మీడియా ప్రతినిధి పై కూడా అతను దాడి చేసాడు. దీనితో మహేష్ భగవత్ కి జర్నలిస్ట్ లు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన సీపీ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: