అసలే లాక్ డౌన్ జనాలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. అవసరం ఉన్నా సరే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇప్పుడు అడవి జంతువులు బయటకు వచ్చి ఎక్కువగా సందడి చేస్తున్నాయి. హైదరాబాద్ లో పులిని పట్టుకోకముందే నిజామాబాద్ జిల్లాలో కూడా పులి హడావుడి మొదలయింది. 

 

ఎడపల్లి మండలంలో గత నాలుగు రోజుల నుంచి పులి ఎక్కువగా సంచరిస్తుంది. దీనితో ఇప్పుడు స్థానికుల్లో భయం మొదలయింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి జాడలను గుర్తించి దాన్ని పట్టుకుంటామని ప్రజలు ఎవరూ భయపడవద్దు అని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: