మహారాష్ట్రలో కరోనా ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పుడు మావోయిస్ట్ లకు కూడా కరోనా కేసులు సోకినట్టు తెలుస్తుంది. గడ్చిరోలి, చంద్రాపూర్, గొండియా జిల్లాల్లో కూడా కరోనా కేసులు ఉన్నాయి. నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చిన మావోలకు కరోనా సోకింది. 

 

దీనితో మావోలు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు అక్కడ కరోనాను గుర్తించడానికి వాళ్ళు వైద్యులను అడవిలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారని, ఇప్పుడు అడవిలో సామాజిక దూరం  పాటిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ లను బయటకు వెళ్ళవద్దు అని, గిరిజనుల సహకారం తీసుకోవాలని పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ముగ్గురు మావోలకు కరోనా సోకినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: