ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం రాష్ట్రంలోని షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో షాపులు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇస్తే మాత్రమే కంటైన్మెంట్ జోన్లలో షాపులు తెరవాలని సూచించింది. 
 
రెండు రోజుల క్రితమే ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. తాజాగా పండ్లు, కూరగాయల దుకాణాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లు, వస్త్ర, నగలు, చెప్పుల షాపులపై ఆంక్షలు కొనసాగనున్నాయి. పట్టణాల్లో సరి బేసి విధానాల్లో షాపులు తెరిచేందుకు అనుమతులిచ్చింది. తక్కువ కేసులు నమోదైన మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర సరుకుల షాపులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: