కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. కేంద్రం మూడో విడత లాక్ డౌన్ ఆనంతరం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పలు రాష్ట్రాలు మాత్రం మద్యం దుకాణాల వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని భావించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉంది. అయితే తాజాగా పోలీసులు జరిపిన తనిఖీల్లో ఒక కారులో మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. 
 
కారులో మద్యం బాటిళ్లు బయటపడటంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఆ కారు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు షాక్ అయ్యారు. బీహార్ లోని సిమ్రీ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం బాటిళ్లతో పట్టుబడిన కారు బుక్సర్ సదర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ కారు అని ఎస్పీ ఉపేంద్రనాథ్ శర్మ మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే తివారీ మాత్రం తన ఇమేజ్ ను దెబ్బ తీయటానికి ఎవరో కావాలని మద్యం బాటిళ్లు పెట్టారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: