ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ఫేక్ మెసేజ్ లను వైరల్ చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఫేక్ మేసేజ్ లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో 1990 నుంచి 2020 మధ్య పని చేసిన ఉద్యోగులకు 1,20,000 రూపాయల మేర కేంద్రం నుంచి ప్రయోజనాలను పొందవచ్చంటూ ఒక వాట్సాప్ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన చేసినట్టు ఆ మెసేజ్ లో ఉంది. 
 
కొందరు సైబర్ మాయగాళ్లు వాట్సాప్ లో మెసేజ్ తో పాటు ఒక లింక్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ లింక్ పొరపాటున ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు వైరల్ అవుతున్న మెసేజ్ గురించి స్పందిస్తూ ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన వెలువడలేదని... అలాంటి ఫేక్ మెసేజ్ లను ఎవరూ నమ్మవద్దని... ఫేక్ వెబ్ సైట్ లింక్ లను క్లిక్ చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: