మృతదేహాలకు కరోనా పరిక్షలు నిర్వహించకపోవడాన్ని తెలంగాణా హైకోర్ట్ తప్పుబట్టింది. తెలంగాణా ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరిక్షలు నిర్వహించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిగింది. 

 

ఈ సందర్భంగా హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని, ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ స్పష్టమైన సూచనలు చేసింది. చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే... కరోనా 3వ స్టేజికి వెళ్లే ప్రమాదం ఉందని పిటీషనర్ కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. కాగా తెలంగాణాలో సరిగా కరోనా పరిక్షలు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: