దేశంలో ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొంత మంది చేయాలన్నా పని దొరకడం లేదు.. దాంతో పక్కదారులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు దొంగలు చోరీకి యత్నించడం, వారిలో ముగ్గురు మరణించడం కలకలం రేపింది.  కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనుల్లో ఈ ఘటన జరిగింది. కేజీఎఫ్ అనగానే ఆ మద్య హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్’ గుర్తుకు వస్తుంది.. కానీ అది కాదు. కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గనుల్లో ఇనుప సామగ్రి దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. సరైన భద్రత పాటించకుండా ఆ ఐదుగురు దాదాపు గనుల్లో 100 అడుగుల లోతుకు వెళ్లగా, అక్కడ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోవడంతో వారు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యారు.

 

దాంతో అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు.. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషాదంగా ఉంది. అయితే ఊపిరి ఆడకపోవడంతో గట్టిగా కేకలు వేశారు.. దాంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. లాక్ డౌన్ అమల్లో ఉండడంతో గత కొన్నివారాలుగా కోలార్ ప్రాంతంలో బంగారం వెలికితీత పనులు నిలిచిపోగా, కేజీఎఫ్ గనులు మూతపడి ఉన్నాయి. దాంతో అక్కడ ఎవరూ లేరు అనుకొని దొంగలు ఇలా తెగించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: