దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. ఇక చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రోజు కూలీ పనులు చేసుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పలు వివరాలను వెల్లడించడానికి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు ఆమె మీడియా ముందుకు వచ్చారు. 

 


ఈ సందర్భంగా వలస కార్మికులు, చిరు వ్యాపారస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు తెలిపారు. రెండో విడత ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తూ.. మొత్తం 9 రంగాల్లో ఉద్దీపన చర్యలు  ప్రకటించనున్నట్లు తెలిపారు.  వలసకూలీలు,వీధి, చిరు వ్యాపారులు, చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక ప్యాకేజీలో వెసులు బాటు.  అలాగే వ్యవసాయానికి ఊతంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: