ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్లలోని రెండో ప్యాకేజ్ లో వలస కార్మికులు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చింది కేంద్రం. అసంఘటిత రంగంలోకి కార్మికులు అందరికి కూడా భారీగా నిధులను కేటాయించింది. ఇక వారి అందరికి వైద్య పరిక్షలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

 

అసంఘటిత రంగంలోని కార్మికులు అందరికి ఇక నుంచి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని అన్నారు. వలస కార్మికులకు కనీస వేతనం 180 నుంచి 202 రూపాయలకు పెంచినట్టు ఆమె వివరించారు. కార్మికులు అందరికి కనీస వేతన హక్కు ఉంటుందని నిర్మల ప్రకటించారు. వారి ఆరోగ్యం బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని నిర్మల సీతారామన్ చెప్పారు. కార్మికుల కోసం దేశం అంతా వేతనం ఇస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: