కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజి లో అసంఘటిత రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా వలస కార్మికులకు వీధి వ్యాపారులకు రుణాల సదుపాయం కల్పించారు. ఇక హోం లోన్ తీసుకున్న వారికి కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలకు వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

 

రూ ఆరు లక్షల నుంచి 18 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని అని ఆమె పేర్కొన్నారు. పట్టణ పేదల కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం ప్రకటిస్తున్నామని నిర్మల ఈ సందర్భంగా వివరించారు. దీని ద్వారా మధ్య తరగతి వారికి ప్రయోజనం కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: