కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజిలో రైతులకు పెద్ద పీట వేసింది కేంద్ర ప్రభుత్వం. రెండున్నర కోట్ల రైతులకు కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నట్టు కేంద్రం చెప్పింది. పంట కోతల అనంతర కార్యక్రమాల కోసం అదనంగా రైతులకు 30 వేల కోట్లను ఇస్తున్నట్టు చెప్పారు. రైతులకు నలుగు లక్షల కోట్ల రుణాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

 

వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద పీట వేస్తామని అన్నారు. కొత్త నిధులతో మూడు కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది అని నిర్మల చెప్పారు. అదే విధంగా కిసాన్ క్రెడిట్ కార్డులను పశు పోషకులు, మత్య్స కారులకు కూడా ఇస్తామని ఆమె వివరించారు. రబీ కోతలు ఖరీఫ్ ముందస్తు ఏర్పాట్ల కోసం నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: