పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న గార్డెన్‌లో అరుదైన 'మే ఫ్లవర్' మొక్క కి ఎంతో ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే.    అరుదుగా కనిపించే మే పుష్పం హైదరాబాద్‌ శివారులో వికసించింది. తుర్కలాంజిల్‌ దగ్గర్లోని రామన్నగూడలో ఉంటున్న ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి ఇంట్లో మూడు మే పుష్పాలు వికసించాయి. ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌ హార్టికల్చర్‌ ఎగ్జిబిషన్‌ నుంచి ఈ పుష్పాన్ని తీసుకొచ్చామని ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా పూసిందని మారెడ్డి జయశ్రీ చెబుతున్నారు. మే 1వ తేదీ నుంచి మొక్కగా పెరుగుతూ 15న పూలతో వికసించినట్లు తెలిపారు.  15 రోజులపాటు అందమైన పుష్పాలతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచి 30వ తేదీ అనంతరం చెట్టు చనిపోతుందని, సంవత్సరమంతా ఆ మొక్క ఇక కనిపించదు అని తెలిపారు. 

IHG

భూమిలో ఉన్న వేర్లగడ్డ తిరిగి మే నెలలోనే మొక్కగా పెరిగి పూలతో వికసిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పూల మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని  వారు తెలిపారు. మే నెలలో వికసించడమే దీని ప్రత్యేకత అని దీన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారని ఆమె చెబుతున్నారు.  ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు

IHG'మే' ఫ్లవర్ | Andhrabhoomi - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> ...

ఈ పుష్పం చూడటానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క. ఒక్క సారి నేలలో పాతితే అది చనిపోవడం అంటూ ఉండదు. నెమ్మదిగా పిలకలు వేస్తూ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంతగా ఇది పూలతో వికసిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: